Tuesday, January 7, 2025
HomeAP జిల్లా వార్తలుఅనంతపురంJC Prabhakar Reddy: హీరోయిన్ మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

JC Prabhakar Reddy: హీరోయిన్ మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఏం మాట్లాడినా సంచలనమే. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే ఆయన వైఖరే ఇందుకు కారణం. సీఎం చంద్రబాబు నుంచి కింది స్థాయి నేతల వరకు ఎవరినైనా సరే విమర్శలు చేస్తూ ఉంటారు. తాజాగా జేసీ మరోసారి తన వ్యాఖ్యలతో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయ్యారు. ఈసారి బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత(madhavi latha)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -

ఆమె ఒక వేస్ట్ క్యాండిటేట్ అని..ప్రాసిట్యూట్ అంటూ ఘాటు విమర్శలు చేశారు. మహిళలను అవమానించేలా మాధవీలత మాట్లాడారని… జేసీ పార్కులో ఎలాంటి దారుణ ఘటనలు జరగడం లేదని చెప్పారు. తాడిపత్రిలోని మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. ఆరెస్సెస్, బీజేపీ, వీహెచ్‌పీ నాయకులు హిజ్రాల కంటే దారుణమన్నారు.

ఇక అనంతపురంలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జేసీ మాట్లాడుతూ.. బస్సు దగ్ధం ఘటనపై తాను ఫిర్యాదు చేయబోనని తెలిపారు. చేతనైతే పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని చెప్పారు. బీజేపీ నేతలే తమ బస్సులను తగలబెట్టించారని అనుమానం వ్యక్తం చేశారు. 300 బస్సులు పోతేనే తాను బాధపడలేదని ఇప్పుడు ఎందుకు బాధపడతానని జేసీ వెల్లడించారు.

కాగా కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా తాడిపత్రి మహిళలకు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌పై మాధవీలత స్పందిస్తూ… జేసీ పార్క్ వైపు మహిళలు వెళ్లవద్దని సూచించారు. అక్కడ దారుణమైన ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై తాజాగా జేసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఎల్ అండ్ టీ కంపెనీ పాండ్ యాష్‌ విషయంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News