కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. ఏపీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 పోస్టులకు నోటిఫికేషన్(Jobs) జారీ చేసింది. ఎంబీఏ అర్హతతో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీ చేయనుంది. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రస్తుతం ఏడాది కాలానికి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఆ తర్వాత పరిస్థితిని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.60 వేల వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 13వ తేదీ దరఖాస్తులకు చివరితేది. 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థికి 40 ఏళ్లకు మించకుండా ఉండాలి. పూర్తి వివరాల కోసం https://apsdpscareers.com/YP.aspxలో చూసుకోవచ్చు. కాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయం కోసం ఈ పోస్టులు చేపట్టనుంది.