మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani)సతీమణి జయసుధ(Perni Jayasudha)దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా పేర్ని జయసుధ మచిలీపట్నం 9వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది వరదరాజులు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా లంకే వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈనెల 30వ తేదీకి బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేశారు.
కాగా గత వైసీపీ ప్రభుత్వం హయాంలో నాని తన భార్య జయసుధ పేరిట గోడౌన్ నిర్మించిన సివిల్ సప్లై శాఖకు అద్దెకు ఇచ్చారు. అయితే ఆ గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం నిల్వల్లో తేడాలు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల అధికారి కోటిరెడ్డి ఫిర్యాదుమేరకు ఆమెపై కేసు నమోదు చేశారు.