Saturday, May 18, 2024
Homeఆంధ్రప్రదేశ్YSRCP: వైసీపీలో జంప్ జిలానీలు.. గోడ దూకేందుకు సిద్ధంగా పాతిక మంది ఎమ్మెల్యేలు?

YSRCP: వైసీపీలో జంప్ జిలానీలు.. గోడ దూకేందుకు సిద్ధంగా పాతిక మంది ఎమ్మెల్యేలు?

YSRCP: వైసీపీలో అంతర్గతంగా బయటకు కనబడని సంక్షోభం ముదురుతోందా? దాదాపు పాతిక మంతి ఎమ్మెల్యేలు పార్టీకి జెల్ల కొట్టి తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తలుపులు మూసి కొడితే.. పిల్లి కూడా తిరగబడుతుంది అన్నట్లుగానే గడపగడపకూ, వర్క్ షాపులంటూ వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న హడావుడి, పనితీరు బాలేదంటూ నిత్యం అవమానిస్తున్న తీరు ఎమ్మెల్యేలలో ఎమ్మెల్యేలలో అసహనానికి కారణమౌతోందంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకతకు కారణం ఎమ్మెల్యేలే అంటూ జగన్ కార్నర్ చేస్తున్న తీరు వారిలో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోందంటున్నారు.

- Advertisement -

వచ్చే ఎన్నికలలో పోటీకి పార్టీ టికెట్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే జగన్ ఇలా వ్యవహరిస్తున్నారన్నది వారి అభిప్రాయంగా కనిపిస్తోందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఇక జగన్ సీటు ఇచ్చే ఛాన్స్ లేదన్న నిర్ణయానికి వచ్చేసిన పాతిక మంతి సిట్టింగ్ లు తమ దారి తాము చూసుకునేందుకు ఇప్పటికే సిద్ధమైపోయారన్నది వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్న టాక్. ఒకవేళ టికెట్ వచ్చినా వచ్చినా.. జగన్ సర్కార్ పై ఏపీ వ్యాప్తంగా పెల్లుబుకుతున్న వ్యతిరేకత కారణంగా విజయావకాశాలు మృగ్యం అన్న నిర్ణయానికి వారు వచ్చేశారన్నది పరిశీలకుల విశ్లేషణ. తమకూ, ప్రజలకూ మధ్య సంబంధం లేకుండా వాలంటీర్ల పేర అడ్డుగోడ కట్టి.. ఇప్పుడు ప్రజలలో వ్యతిరేకత అంటూ తమను బలిపశువులను చేస్తున్న తీరును వారు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నామని కొందరు సిట్టింగ్ లు ప్రైవేటు సంభాషణల్లోనే చెబుతున్నారు.

అయితే.. వచ్చే డిసెంబర్ లో జరిగే వైసీపీ శిబిరంలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేల భవితవ్యంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే జగన్ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో టికెట్లు రావనుకుంటున్న వారు, ఒకవేళ టికెట్ వచ్చినా గెలిచే అవకాశం లేదనుకుంటున్న వారు గోడదూకే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి. అలాంటి వారి సంఖ్య పాతికకు అటూ ఇటూ ఉండొచ్చన్నది పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు పొడిస్తే.. రాష్ట్రంలో వైసీపీ ఉనికే ప్రమాదంలో పడుతుందన్న భయం కూడా సిట్టింగ్ లలో నెలకొని ఉందంటున్నారు.

వైసీపీ నుంచి ఫిరాయింపుల ప్రచారం నేపథ్యంలో సిట్టింగ్ లపై వైసీపీ అధినేత నిఘా పెట్టినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఇక పార్టీ వర్గాల నుంచే అందుతున్న సమాచారం మేరకు గోదావరి జిల్లాల నుంచే గోడ దూకడానికి సిద్ధంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య అధికంగా ఉందంటున్నారు. అలాగే గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా ఇటువంటి వారు ఉన్నారన్న అనుమానాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన తరువాత నుంచీ పార్టీలో అసమ్మతి బీజం పడిందనీ, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆ బీజం మెలకెత్తి పెరుగుతోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News