Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jupadubangla: పశు వైద్యశాల ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త జయ సూర్య

Jupadubangla: పశు వైద్యశాల ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త జయ సూర్య

గ్రామాలకు అన్ని వసతులు..

జూపాడుబంగ్లా మండల పరిధిలోని పారుమంచాల గ్రామంలో పశు వైద్యశాలను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రారంభించారు. పశు వైద్యశాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గిత్త జయ సూర్య, నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మండ్ర శివానందరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్రా శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మాట్లాడుతూ పారుమంచాల గ్రామంలో పశు వైద్యశాల కట్టడానికి చెన్నై వారి 60 లక్షలతో పశువైద్యశాల నిర్మించామన్నారు. ఆసుపత్రి నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని మందడి రఘునాథరెడ్డి ఇవ్వగా దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ గ్రామం అయినా అభివృద్ధి చెందాలంటే సర్పంచులు లీడర్లు ఎవరైనా మంచి హోదాలో ఉన్నవారు సహకరిస్తే గ్రామాభివృద్ధి చెందుతుందని అన్నారు. 2014 నుండి 2019 సంవత్సరంలో ఇసుక వాగు బ్రిడ్జి నిర్మాణం తెలుగుదేశం టైంలోనే జరిగిందన్నారు. పారుమంచాల చెరువుకు నీళ్లు నింపడానికి కలమందలపాడు నుండి హెచ్ ఎన్ ఎస్ ఎస్ లిఫ్ట్ ఏర్పాటు చేసి కాకులేరు వాగు ద్వారా నీళ్లు నింపడానికి తెలుగుదేశం ప్రభుత్వం మద్దిగుండం చెరువు కచ్చితంగా నింపుతుందని, ఆ బ్రిడ్జిని కూడా వేరే కాంట్రాక్టరుతో సంవత్సరం లోపల కంప్లీట్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేశారు.

సీఎం దృష్టికి..

జూపాడుబంగ్లా లిఫ్ట్ నుండి కూడా మీ పొలాలకు వస్తున్నాయని, మోటర్లు ప్రాబ్లం ఉన్న వల్ల విషయం కూడా సీఎం దృష్టికి ఇరిగేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. నిధులు కేటాయించాక రిపేర్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని, ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడం ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని అన్నారు. ఈ గ్రామాభివృద్ధి కోసం తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వసతులు కల్పిస్తామన్నారు. మీ గ్రామానికి సంబంధించిన పింఛన్లు బిల్డింగ్స్ వెంకటరామిరెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రకాశం సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మందడి వెంకట్రామిరెడ్డి,మాండ్ర సురేంద్రనాథరెడ్డి, మండల కన్వీనర్ వెంకటేశ్వర యాదవ్, టిడిపి మండల కార్యదర్శి సీఎం రామ్మోహన్ రెడ్డి, 80 బన్నూర్ పరమేశ్వర్ రెడ్డి, పోతులపాడు మాజీ సర్పంచ్ రవికాంత్,గ్రామ సర్పంచి ప్రకాశం, మాజీ సర్పంచ్ పిక్కిలి శ్రీనివాసుల, తుడిచెర్ల సర్పంచ్ బాలమదిరెడ్డి, చల్ల శివరామిరెడ్డి, రవి కుమార్ యాదవ్, టిడిపి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News