AP High Court CJI Justice Lisa Gill: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు శనివారం సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, LLB, LLM పూర్తి చేశారు. ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజేగా ఆమె చరిత్ర సృష్టించారు.

Also Read: https://teluguprabha.net/sports-news/punjab-kings-beat-delhi-capitals-by-6-wickets-chase-264-score/
జస్టిస్ లీసా గిల్ పంజాబ్-హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. న్యాయ రంగంలో దాదాపు 36 ఏళ్ల అనుభవం ఉన్న ఆమె.. గత నెలలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చారు.

Also Read: https://teluguprabha.net/telangana/47-maoists-surrender-before-telangana-police/
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

