Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kakani: హీఫర్ సహకారంతో రైతుల ఆర్థికాభివృద్ధి

Kakani: హీఫర్ సహకారంతో రైతుల ఆర్థికాభివృద్ధి

హీఫర్ అంతర్జాతీయ సంస్థ సహకారంతో రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్) ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఆహార శుద్ధి శాఖామాత్యులు కాకాణి గోవర్ధన రెడ్డి తెలిపారు. అమెరికా ప్రధాన కార్యాలయంగా పేదరికం, ఆకలి, పర్యావరణం అంశాలపై పని చేస్తున్న హీఫర్ అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులతో ఆయన బేటీ అయ్యారు. రాష్ట్రంలో ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కు వారు అందించే సహకారంపై చర్చించారు.

- Advertisement -

ఎఫ్ పీ ఓలతో కలసి రైతుల ఆర్థికాభివృద్ధిలో హీఫర్ సంస్థ ప్రతినిధుల భాగస్వామ్యం అభినందించదగిందని మంత్రి కొనియాడారు. రాష్ట్రంలో ముందుగా అత్యంత సామర్థ్యం గల ఎఫ్ పీఓలను గుర్తించి, ఎఫ్ పీఓలోని సీఈఓ, బోర్డు డైరెక్టర్లు, రైతులకు ఈ సంస్ధ ప్రతినిధులు శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తారని చెప్పారు. వీరు ఇప్పటికే ఒడిషా, బీహార్ లలో పని చేశారని, మన రాష్ట్రంలో తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో పని చేస్తున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News