Saturday, April 5, 2025
Homeఆంధ్రప్రదేశ్Kakani: శబరి క్షేత్రంలో మంత్రి కాకాణి పూజలు

Kakani: శబరి క్షేత్రంలో మంత్రి కాకాణి పూజలు

మహోన్నత వ్యక్తిత్వం కల్గిన శ్రీరామచంద్రుల వారి జీవితం మానవాళికి ఆదర్శప్రాయమని మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు. శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకొని నగరంలోని శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో కన్నులపండుగగా నిర్వహించిన జగదభిరాముడు శ్రీ సీతారామ స్వామి కళ్యాణానికి సతీ సమేతంగా హాజరై ,జిల్లా కలెక్టర్ కె వి యన్ చక్రధర్ బాబు దంపతులతో కలసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా శబరి శ్రీరామ క్షేత్రం ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాలు నిరాటoకంగా, దిగ్విజయంగా జరుపటం సంతోషదాయకమన్నారు. ధర్మాన్ని కాపాడటానికి ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కోవాలనే శ్రీరాముల వారి జీవితం ప్రస్తుత సమాజానికి ఆదర్శమన్నారు. జీవితంలో ఆచరించాల్సిన, సాధించాల్సిన వాటి గురించి స్వయంగా ఆచరించి చూపి పురుషోత్తముడిగా అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News