Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kalluru: ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Kalluru: ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ఎంపీడీవో ఆఫీసులో

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కల్లూరు ఎంపీడీవో కార్యాల ఆవరణంలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించి, గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కల్లూరు మండలంలో ఎంపీపీని సన్మానించి, కేక్ కట్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులతో సమానంగా పోటీపడి, నిజజీవితంలో ఎన్నో శిఖరాలను అధిరోహిస్తున్నారని వారు పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి మహిళా చైర్మన్ టైపిస్టు మల్లేశ్వరి , ఏపీవో మద్దేశ్వరమ్మ, ఈసీ మధుబాబు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News