జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని వైఎస్ఆర్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 7వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టినట్లు ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, కొడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వాలెంటరీ, సచివాలయం ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పాలనా అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కన్వీనర్లు, కలిసి కట్టుగా జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందన్నారు.
సీఎం జగన్ పరిపాలనతో అభివృద్ధి చెందామని రాష్ట్ర ప్రజలు మెగా పీపుల్ సర్వేలో సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో అమ్మ ఒడి నుండి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర లో అమలు చేశామన్నారు.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకు 36 హామీలను ఇచ్చారు, కానీ, ఇందులో ఒక్క హామి కూడా బాబు నేరవేర్చలేదని మండిపడ్డారు.కర్నూలు జిల్లాలో టిడిపి పార్టీ నేతలను నమ్మే వారు లేరని ధ్వజమెత్తారు.