BJP MLA Withdraw Controversial comments: టాలీవుడ్ అగ్ర హీరోల వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో స్పందించారు. తన వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయని పేర్కొన్న శ్రీనివాస్.. వాటిని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కోరారు.
సభలో విజ్ఞప్తి: గతంలో సినిమా వాళ్లను పిలిచి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అవమానించారంటూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపింది. దీంతో ఈ ప్రకటనపై ఆయన యూటర్న్ తీసుకున్నారు.తన వ్యాఖ్యలను వెంటనే రికార్డుల నుంచి తొలగించాలంటూ సభలో విజ్ఞప్తి చేశారు. చిరంజీవి సహా.. హీరోలను జగన్ అవమానించినట్లు మాట్లాడిన మాటలను కూడా తొలగించాలని కోరారు.
అసలేం జరిగిందంటే: వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవిని, సినిమా వాళ్లను అవమానించినట్టు కామినేని అసెంబ్లీలో ఇటీవల ఓ ప్రకటన చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్‌ను కలవడానికి వెళ్లినప్పుడు వారికి సరైన గౌరవం ఇవ్వలేద కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. జగన్ వారిని కలవడానికి అంతగా ఆసక్తి చూపలేదని అన్నారు. చివరికి చిరంజీవి గారు ఒత్తిడి చేయడంతోనే జగన్ కలవడానికి అంగీకరించారని నిండు అసెంబ్లీ సాక్ష్యిగా శ్రీనివాస్ తెలిపారు. దీంతో కామినేని వ్యాఖ్యలను బాలకృష్ణ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలో ఆవేశంతో మాట్లాడిన బాలయ్య చిరుపై నోరు పారేసుకున్నారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/wind-gusts-over-the-bay-of-bengal-coast/
చిరంజీవి స్పందన: బాలయ్య, కామినేని వ్యాఖ్యలపై వెంటనే చిరంజీవి స్పందించారు. కామినేని అబద్ధాలు చెప్పారంటూ స్వయంగా చిరంజీవి ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్ జగన్ తనను సాదరంగా ఆహ్వానించారంటూ అందులో తెలిపారు. దీంతో.. రాజకీయంగా ఈ అంశం పెద్దదుమారానికి దారితీసింది. బాలకృష్ణ -చిరంజీవి మధ్య వివాదానికి దారితీశాయి.
వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆగ్రహం: వైఎస్ జగన్‌పైనా అనుచిత వ్యాఖ్య చేయడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సైతం బాలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. కామినేని మాటలు టీడీపీ మెగా అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఈ వ్యవహారంపై దీనిపై సీఎం చంద్రబాబు కూడా అసహనం వ్యక్తం చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


