Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Nara Lokesh: నారా లోకేష్ ట్వీట్‌కు కర్ణాటక మంత్రి కౌంటర్

Nara Lokesh: నారా లోకేష్ ట్వీట్‌కు కర్ణాటక మంత్రి కౌంటర్

Lokesh vs MB Patel: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పనిచేస్తుంది. పెట్టుబడులు పెట్టే కంపెనీలకు త్వరితగతిన అనుమతులతో పాటు ప్రోత్సహకాలను అందిస్తోంది. అదే సమయంలో ఏ చిన్న అవకాశం దొరికినా సద్వినియోగం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం వద్దనుకున్న ఏరోస్పేస్ ప్రాజెక్టును రాష్ట్రానికి ఆహ్వానించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

అసలు ఏం జరిగిందంటే. కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలోని గ్రామాల్లో ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం చేపట్టదలచిన భూసేకరణ ప్రక్రియను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భూసేకరణకు రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఏరోస్పేస్ ప్రాజెక్టు కోసం 1,777 ఎకరాలను సేకరించాలని కర్ణాటక ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అయితే ఆ గ్రామాల్లోని రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన తెలిపారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకే తమ ప్రాధాన్యత అని స్పష్టంచేస్తూ భూసేకరణ నిర్ణయాన్ని రద్దు చేసింది.

కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకొచ్చారు. ఏరోస్పేస్‌కు భూసేకరణ నిర్ణయాన్ని కర్ణాటక సర్కార్ వెనక్కి తీసుకోవడం బాధగా ఉందన్నారు. అయితే ఇదే సమయంలో ఏపీకి ఎందుకు పెట్టబుడు పెట్టకూడదని సూచించారు. తమ ప్రభుత్వం దగ్గర అద్భుతమైన ఏరోస్పేస్ పాలసీ ఉందన్నారు. బెంగళూరుకు సమీపంలోనే 8వేల ఎకరాలకు పైగా భూమి కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇందుకోసం చర్చలు జరుపుద్దామని ఆహ్వానం పంపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

Also Read: ఏపీలో భయానక వాతావరణం.. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే: జగన్

లోకేశ్ ట్వీట్‌పై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు. తమ రాష్ట్రం ఇండియాలోనే నెంబర్ వన్ ఏరోస్పేస్ డిఫెస్ ఎకో సిస్టమ్ కలిగి ఉందన్నారు. కొన్ని దశాబ్దాలుగా దేశంలోనే బలమైన ఏరోస్పేస్ స్థావరాన్ని నిర్మించామని తెలిపారు. ఏరోస్పేస్ ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్‌గా, ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని చెప్పారు. ఎప్పుడు ఏం చేయాలో తమకు తెలుసుని.. ఏదీ తమ రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad