Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా కాటసాని

Katasani: అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా కాటసాని

అవుకు మండలం అన్నవరం గ్రామ సచివాలయం పరిధిలో కల చిన్న కోట్టాల, నిచ్చేనమెట్ల, అన్నవరం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. అనంతరం అన్నవరం గ్రామ సచివాలయం పరిధిలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైయస్సార్ హెల్త్ క్లినిక్, మినరల్ వాటర్ ప్లాంట్, డ్రైనేజీ, సీసీ రోడ్లను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు.

- Advertisement -


ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని సైతం ప్రగతి పథంలో మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు తీసుకువెళుతున్నారు అని అందుకు నిదర్శనమే గ్రామీణ ప్రాంతం అయిన అన్నవరం గ్రామ సచివాలయం పరిధిలో 2 కోట్ల రూపాయలతో శాశ్వత నిర్మాణాలు చేపట్టడమన్నారు.

గొల్లలేరు డ్రైన్ నిర్మాణం చేపట్టడానికి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి, అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వినర్ కాటసాని తిరు పాల్ రెడ్డి, చిన్న కొట్టాల వైయస్సార్ పార్టీ నాయకులు తిరుపెం రెడ్డి, శ్రీనివాస రెడ్డి, నిచ్చెన మెట్ల గోపాల్ రెడ్డి, చెన్నప్ప, అన్నవరం గ్రామ వైయస్సార్ పార్టీ నాయకులు సాయి నాథ్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, రాజేష్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, కసిరెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News