బనగానపల్లె నియోజకవర్గంలో కోయిలకుంట్ల మండలం సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే వారధులు వాలంటీర్లేనని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. కోవెలకుంట్ల మండలానికి చెందిన వాలంటీర్ల కోసం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహిచారు. కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతున్నదని చెప్పారు. గుమ్మం వద్దకే ప్రభుత్వ పథకాలు వెళుతున్నాయని చెప్పారు. ప్రతి నెలా తొలి రోజే వేకువజామునే పింఛన్లు పంపిణీ చేసే విషయంలో వాలంటీర్ల కృషి గొప్పదని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నదన్నారు. ఏకంగా 2.5లక్షలకు పైగా వాలంటీర్లు, 1.5 లక్షల వరకు సచివాలయ ఉద్యోగులు మొత్తం 4 లక్షల మంది ఈ వ్యవస్థ కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రజలకు నిరంతరం ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ధ్యేయంగా సచివాలయ వ్యవస్థ పనిచేస్తున్నదని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణల్లో ఇదొక గొప్ప వ్యవస్థ అని వెల్లడించారు. ప్రభుత్వం సేవా మిత్ర అవార్డు ఇచ్చి సత్కరిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Katasani: వాలంటీర్లను గౌరవించుకోవడం సంతోషకరం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES