Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: మండలాధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

Katasani: మండలాధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

అవుకు మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి హాజరై మండల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొంతమంది అధికారుల విధుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలో ఏదైనా సమస్యలు తలెత్తితే మండల ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి తో గాని లేదంటే ఎమ్మెల్యే దృష్టికి గాని తీసుకువచ్చి ఆ సమస్యకు పరిష్కారం అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అన్ని మండలాల్లో పంట నష్ట పరిహారం, రైతు భరోసా లాంటి ఎన్నో రైతుకు సంబంధించినటువంటి పథకాలు అందించడంలో ముందుంటే ఆవుకు మండలంలో మాత్రం రైతులకు సంబందించిన విషయాల్లో మాత్రం చాలా వెనుకబడి ఉండడం వ్యవసాయ అధికారుల పట్ల అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -

గ్రామల్లో క్రాప్ ఈ బుకింగ్ గాని పంట నష్ట పరిహారంలో గాని రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవసాయ అధికారులు కూడా వ్యవహరించాలని చెప్పారు. గ్రామీణ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జలజీవన్ పథకం ద్వారా ప్రతి గ్రామానికి పైపులైన్ ద్వారా కొళాయి కనెక్షన్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుము కట్టిందని అందులో భాగంగానే బనగానపల్లె నియోజకవర్గం లో మొదటి విడతగా దాదాపుగా 100 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యి పనులు పూర్తి దశకు చేరుకోవడం జరిగిందని చెప్పారు. అయితే గ్రామీణ ప్రాంతాలకు తరలించే మంచినీటి పైపు కనెక్షన్ ద్వారా చెన్నంపల్లి గ్రామంలో కొంతమంది రైతులు పొలాలకు వినియోగించుకుంటూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని RWS ఇంజినీర్ కరిముల్లా పై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలని అలా నిర్వర్తించని అధికారులు ఎవరైనా ఉంటే తమ నియోజకవర్గాన్ని విడిచి వేరే నియోజకవర్గాలకు వెళ్లాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులకు హెచ్చరించారు. ప్రజలకు త్రాగునీరు అందించే పైపు కనెక్షన్ ద్వారా రైతులు పొలాలకు వినియోగించుకుంటే మీరు ఎందుకు అలాంటి వారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

బనగానపల్లె నియోజకవర్గం లో అన్ని మండలాల్లో అంగన్వాడి కేంద్రాల కోసం దాదాపు 5 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు జరుగుతుంటే అవుకు మండలంలో మాత్రం అంగన్వాడి కేంద్రాల నిర్మాణాలపై ప్రతి పాదనలు ఇవ్వకుండా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలంటే ప్రజా ప్రతినిధులతో కలిసి అధికారులు కూడా పనిచేస్తేనే ఆ మండలం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని కావున ప్రజాప్రతినిధులతో కలిసి అధికారులు అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆవుకు మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, తహసిల్దారు శ్రీనివాసులు, రోడ్లు మరియు భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్, మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ కరిముల్లా,పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ మహమ్మద్ గౌస్, ట్రాన్స్కోఏ ఈ పకీరయ్య, పశు వైద్యాధికారి భారతీదేవి, ఉప్పలపాడు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్, హౌసింగ్ ఏఈ కృష్ణారెడ్డి, అవుకు మేజర్ గ్రామపంచాయతీ ఈవో అశ్విన్ కుమార్, ఉమ్మడి జిల్లాల ఎంపిటిసి సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాల్ రెడ్డి, మండల వైస్ ఎంపీపీ రామప్ప, పట్టణ సర్పంచ్ మంద గురమ్మ, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News