Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

Katasani: చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు

బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. ముందుగా చౌడేశ్వరి దేవస్థానంకు చేరుకోగానే ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభం స్వాగతం పలికారు. చౌడేశ్వరి దేవి అమ్మవారికి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి దేవస్థానంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి త్వరిత గతిన పలు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ఆలయ అధికారి VLN రామానుజన్ ను ఆదేశించారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అర్హులైన వారు ఎవరైనా వుంటే వారికి ఎవరికైనా పథకాలు రాకుంటే అలాంటి వాటికి పరిష్కరించాలంటూ సచివాలయం ఉద్యోగులను ఎమ్మెల్యే కాటసాని ఆదేశించారు. టీడీపీ పార్టీ మాజీ సర్పంచ్ నారాయణమ్మ భర్త బాలయ్య, టీడీపీ మైనారిటీ అభివృద్ధి కమిటీ మెంబర్ హుస్సేన్ సాహెబ్ లు టీడీపీ పార్టీని వీడి వైయస్సార్ పార్టీ లోకి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వైయస్సార్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమానికి గ్రామాల్లో,పట్టణాల్లో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది అని ఎక్కడికి వెళ్ళిన కూడా ప్రజలు సతోషం వ్యక్తం చేస్తున్నారు అని ఇంక కొంత మందికి ఎక్కడైనా సాంకేతిక కారణాల వల్ల రాలేని వారికి వాటినిపరిష్కరించడంజరుగుతుందిఅనిచెప్పారు.పాదయాత్రలో ఇచ్చిన హామీల్లోఇప్పటికే 99 శాతం మేర నెరవేర్చిన ఘనత మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దక్కుతుందిఅనిచెప్పారు.నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకున్ని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే మనమందరం సంతోషంగా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద వానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందడం జరుగుతుంది అని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా వైయస్సార్ పార్టీ అఖండ మెజార్టీ తో గెలిపించాలని పిలుపు నిచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో చౌడేశ్వరి దేవి ఆలయ మాజీ చైర్మన్ పిఆర్ వెంకటేశ్వర్ రెడ్డి,తులసి రెడ్డి,పిఆర్ మురళి రెడ్డి,AV చెన్నారెడ్డి,పాణ్యం దశరథ రామిరెడ్డి,పిఆర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి,సర్పంచ్ దూదేకుల ఖైరున్ బీ,దూదేకులనాగరాజు,ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి,గ్రామ వైయస్సార్ పార్టీ కన్వీనర్ శేఖర్ గౌడ్,పిఆర్ చిన్న ఓబుల్ రెడ్డి, సన్నల రమేష్ రెడ్డి,ఆర్. శేషిరెడ్డి, వైయస్సార్ పార్టీ ఐటీ వింగ్ జాయింట్ సెక్రెటరీ గణేష్ యాదవ్,బిసి సంఘం వైయస్సార్ పార్టీ నాయకులు వడ్డే తిరుపాల్, వడ్డే వెంకట రమణ, వడ్డే సుబ్రమణ్యం, వడ్డే శివ, ఆదాం బాషా, బద్రి,మారుతి,లోకేష్ రెడ్డి ,ఎస్సీ శిఖామణి, చౌడయ్య,హుస్సేన్ బాషా,మహబూబ్ బాషా,వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ,మండలఅధికారులు,గ్రామసచివాలయం సిబ్బంది,గ్రామ వాలంటీర్లు,గృహ సారథులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News