అవుకు పట్టణం మూడవ గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన బనగానపల్లె నియోజకవర్గ శాసన సభ్యులు కాటసాని రామిరెడ్డి గారు పాల్గొన్న చల్లా విఘ్నేశ్వర రెడ్డి,చల్లా భాస్కర్ రెడ్డి, జెడ్పీటీసీ చల్లా శ్రీ లక్ష్మి,దుగ్గిరాల రవీంద్ర రెడ్డి,జిల్లా వైయస్సార్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయచంద్రా రెడ్డి…..
ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి …
ప్రజా సమస్యలను ప్రజలతో స్వయంగా అడిగి తెలుసుకొన్న బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ….
అవుకు పట్టణం మూడవ గ్రామ సచివాలయ పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజా సమస్యలను ప్రజలతో స్వయంగా తెలుసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సాగించారు. అనంతరం వాలంటీర్లకు డివైజ్ లను అందజేశారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని అందులో భాగంగానే పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని చెప్పారు. అవుకు పట్టణంలోని మూడు గ్రామ సచివాలయంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లు ప్రధానంగా తన దృష్టికి తీసుకోవడం జరిగిందని అలాగే ప్రభుత్వ ఇంటి స్థలాలు ఇవ్వాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. త్వరలోనే పట్టణ ప్రజలకు ఇంటి స్థలాల ఏర్పాటు కూడా చేయడం జరుగుతుందని చెప్పారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 15 లక్షల రూపాయలు గడపగడప మన ప్రభుత్వం నిధులు 60 లక్షల రూపాయలు డిఎంఎఫ్ నిధులతో కూడా అవుకు పట్టణ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించడం జరిగిందని చెప్పారు. అవుకు పట్టణంలో దాదాపు కోటి రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం, మండలం KUDA పరిధిలో లేకపోవడంతో కొంత ఆలస్యమైందని చెప్పారు. అవుకు మండలంలో త్వరలోనే అసైన్మెంట్ భూమిని కూడా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. నిత్యం ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలాంటి నాయకునికి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా అఖండ మెజార్టీతో గెలిపించి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అవుకు మండల ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చల్లా విఘ్నేశ్వర్ రెడ్డి, చల్లా భాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి చల్లా శ్రీలక్ష్మి, రవీంద్రారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయ చంద్రారెడ్డి, అవుకు మండలం వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, చల్లా చైతన్య రెడ్డి, చల్లా చరణ్ రెడ్డి, అవుకు మండలం గ్రామ సచివాలయ కన్వీనర్ తల్లం సుబ్రహ్మణ్యం, కొవ్వూరు మద్దయ్య, వాయునంద గౌడ్, మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.