Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: 'జగనన్న సురక్ష పథకా'న్ని అర్హులు సద్వినియోగం చేసుకోండి

Katasani: ‘జగనన్న సురక్ష పథకా’న్ని అర్హులు సద్వినియోగం చేసుకోండి

ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకొని నవరత్నాలు రూపొందించారు

బనగానపల్లె పట్టణం పొదుపు భవనంలో జగనన్న సురక్ష శిక్షణ కార్యక్రమంను బనగానపల్లె మండలం అభివృద్ధి అధికారి శివరామయ్య అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బనగానపల్లె నియోజకవర్గంలోని బనగానపల్లె కోవెలకుంట్ల సంజామల అవుకు కొలిమిగుండ్ల మండల అభివృద్ధి అధికారులు మరియు తహసీల్దారులు వారితోపాటు గ్రామపంచాయతీ సెక్రటరీలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రతిపక్ష నేతగా 368 కిలోమీటర్లు పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకొని నవరత్నాలు పథకాల ద్వారా అర్హులైన ప్రతి పేదవారికి పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించామన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటికే నాలుగు సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా ఇంకా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారిని వారికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జూలై ఒకటో తేదీ నుంచి ఆగస్టు నెల ఒకటో తేదీ వరకు నెల రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామ సచివాలయానికి మండల తాసిల్దారు, మండల అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో టీములుగా ఏర్పాటు చేసుకొని ఆ గ్రామ సచివాలయ పరిధిలో అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేటట్లు సమస్యలకు పరిష్కారం అందిటట్లు జగనన్న పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

- Advertisement -

కాబట్టి బనగానపల్లె నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి పేదవారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు లభించకపోతే ఆయా గ్రామ సచివాలయాల్లో అధికారులు స్పందన కార్యక్రమం ద్వారా అక్కడే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హత అయ్యేటట్లు సమస్యకు పరిష్కారం అధికారులు అందిస్తారు. దీన్ని బనగానపల్లె నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన పేదవారంతా సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా జగనన్న ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి హామీని నెరవేర్చుతారన్నారు. అలాంటి నాయకున్ని మళ్ళీ మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతుందని కాబట్టి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో కల్లపల్లి మాటలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారి మోసాలను పక్కనపెట్టి ప్రజలకు ఎవరైతే మేలు చేశాడో ఏ ప్రభుత్వం వల్ల మీకు మేలు జరిగిందో ఆ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారం ఇవ్వాలని మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభ్యునిగా కాటసాని రామిరెడ్డి అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు.


ఈ కార్యక్రమంలో అవుకు, బనగానపల్లె మండల తాహసిల్దార్ శ్రీనివాసులు, కొలిమిగుండ్ల మండల తాహాసిల్దార్ అల్ఫ్రెడ్, కోవెలకుంట్ల మండల తహసిల్దార్ పుష్పకుమారి, సంజామల మండల తాహాసిల్దార్, అవుకు మండల వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, వైయస్సార్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, కోయిలకుంట్ల మండల సచివాలయ కన్వీనర్ లాయర్ మాధవరెడ్డి కొలిమిగుండ్ల మండల సచివాలయ కన్వీనర్ మొలక రాజారెడ్డి,పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News