Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: కాటసానికి ఎదురు దెబ్బ

Katasani: కాటసానికి ఎదురు దెబ్బ

పాణ్యం మండలం భూపానపాడులో ‘గడప గడప’ కార్యక్రమంలో గ్రామస్తులు మా సమస్యలు తీర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేసి గడపగడపకు మా ఇంటికి రావద్దని ప్రజలు కాటసాని నిలదీశారు. గ్రామంలో వైసీపీ నాయకులు చెప్పిన వారికి పథకాలు వచ్చే విధంగా చేస్తున్నారని, గ్రామ ప్రజలు కాటసానికి తెలియజేశారు. మా గ్రామంలో వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలను మీరు తెలుసుకొని వాటిని అరికట్టాలని కాటసాని రాంపాల్ రెడ్డికి తెలియజేశారు. వాలంటీర్లు వాళ్ళు అనుకున్న వారికి పథకాలు వచ్చే విధంగా చేస్తున్నారని కాటసాని దృష్టికి తీసుకువచ్చారు. మాకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అంతేకాకుండా సిసి రోడ్లు వేయించాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. మీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తారని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News