Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Katasani: డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే

'నాడు - నేడు' ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మౌలిక వసతులు

బనగానపల్లె మండలంలో ఇల్లూరు కొత్తపేట గ్రామ జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఇంటరాక్టివ్ ప్లాట్ పానెల్ డిజిటల్ తరగతులను బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ముందుగా డిజిటల్ తరగతులను ప్రారంభించి డిజిటల్ ద్వారా అధ్యాపకులు విద్యార్థులకు బోధించే విద్యా విధానం ను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కూడా తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రధానోపాధ్యాయులు సోమశేఖర్ రెడ్డి, అధ్యాపక బృందం శాలువా కప్పి సత్కరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి నేటికీ నాలుగు సంవత్సరకాలం పూర్తయిందని ఈ నాలుగు సంవత్సరాల కాలంలో కరోనా కష్టకాలంతో రాష్ట్రం ఆర్థిక పరంగా అతలాకుతలమైన విషయం మనకందరికీ తెలిసిన విషయమే అని చెప్పారు.

- Advertisement -

కరోనా కష్టకాలంలో కూడా తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల మ్యానిఫెస్టోను తూ.చా తప్పకుండా పాటించి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలకు అందించామన్నారు. కార్పొరేట్ స్కూల్ లకు దీటుగా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘నాడు – నేడు’ అనే మహత్తర కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్లకు మౌలిక వసతులు కల్పించి మహర్దశకు శ్రీకారం చుట్టామన్నారు.

అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటు పాఠశాలలకు ధీటుగా బోధన విద్యా విధానం ఉండాలనే లక్ష్యంతో డిజిటల్ తరగతులను విద్యార్థులకు అందించడానికి శ్రీకారం చుట్టడం జరిగిందని అందులో భాగంగానే ఇళ్ళూరు కొత్తపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 డిజిటల్ తరగతులను ప్రారంభించడం జరిగిందని డిజిటల్ తరగతుల విద్య ద్వారా విద్యార్థులకు సులభతరంగా విద్యను అర్థం చేసుకునే సౌలభ్యాన్ని మన ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అందించడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ధనిక వర్గాల పిల్లలు చదివే ఇంగ్లీష్ మీడియంను కూడా ప్రభుత్వ పాఠశాలలో బోధించేటట్లు చర్యలు తీసుకున్నామని, అయితే తెలుగుదేశం పార్టీ నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లో బోధించకూడదని న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుపడ్డారని, అయితే పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఇంగ్లీష్ విద్యను అభ్యసించాలనే మహా సంకల్పంతో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇంగ్లీష్ మీడియంను తీసుకువచ్చామన్నారు.

ప్రజల కోసం అహర్నిశలు పాటుపడే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే ఇలాంటి ఎన్నో పథకాలతో పాటు అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని కాబట్టి ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా మనం ముఖ్యమంత్రిని వైయస్ జగన్మోహన్ రెడ్డి 175 స్థానాలను గెలిపించి ఆయనను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.ఈ కార్యక్రమంలో అవుకు మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, ఇల్లురు కొత్తపేట గ్రామ సర్పంచ్ గోకుల రమణ, విద్యా కమిటీ చైర్మన్ సుబ్బరత్నమ్మ, ప్రధానోపాధ్యాయులు సోమశేఖర రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News