అవుకు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో 13 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను బనగానపల్లి శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి, అవుకు ఎంపీపీ చల్లా రాజశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. ఎంపీపీ నిధుల కింద నిర్మించిన శుద్ధజల కేంద్రం తహసిల్దార్ కార్యాలయం, మండల అభివృద్ధి అధికారి కార్యాలయం, సచివాలయాలు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయం, ఇందిరా క్రాంతి పథకం కార్యాలయం, విద్యాశాఖ అధికారి కార్యాలయం, హౌసింగ్ ఏఈ కార్యాలయం మరియు ఐటిఐ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడంతో కార్యాలయాలకు వచ్చే వారి దాహర్తి తీర్చడానికి ఈ శుద్ధ జల కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ కార్యక్రమంలో వైసిపి యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి, అవుకు మండల వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి, కాంట్రాక్టర్లు మద్దయ్య, సతీష్, అవుకు మండల సచివాలయాల జెసిఎస్ చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం, లాయర్ గణేష్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు గోపవరం గోపాల్ రెడ్డి, ఉప మండల అధ్యక్షుడు తెలుగు రామప్ప, తహసిల్దార్ శ్రీనివాసులు, మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, వైసిపి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.