Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: మత్స్యకారులకు వాహనం ప్రారంభం

Katasani: మత్స్యకారులకు వాహనం ప్రారంభం

నిత్యం ప్రజల కోసం కష్టపడే జగన్ లాంటి వ్యక్తిని ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి

బనగానపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహంలో సంజామల మండలం గిద్దలూరు గ్రామ మత్స్యకార సంఘానికి 24 లక్షలు రూపాయల విలువ చేసే ఐచర్ వాహనం 3012 మోడల్ వాహనంను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కులవృత్తుల వారికి ప్రభుత్వ సబ్సిడీల ద్వారా వారికి వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగానే మత్స్యకార సంఘం వారికి 24 లక్షల రూపాయల విలువచేసే ఐచర్ వాహనంకు 13 లక్షల రూపాయలు సబ్సిడీ అందించి వారికి వాహనంను మంజూరు చేశామన్నారు. ఈ వాహనం ద్వారా చేపలు పట్టుకొని ఇతర ప్రాంతాలకు తరలించడం అలాగే చెరువుల్లో చేపలు పెంచుకోవడానికి దానా లాంటి రవాణా సౌకర్యం కొరకు ఇలాంటి వాహనాలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని వీటిని మత్స్యకార సంఘం సభ్యులు అందరూ సద్వినియోగం చేసుకొని కులవృత్తుల వారు ఆర్థిక స్వావలం మన దిశగా అభివృద్ధి చెందాలనే లక్ష్యమే మన వైయస్సార్ ప్రభుత్వం ధ్యేయమని చెప్పారు.

- Advertisement -

వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సామాజిక ప్రజలను ఆర్థికంగా వారిని అభివృద్ధి చెందాలని లక్ష్యంతోనే ఎన్నో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందించామన్నారు. గతంలో కేవలం టిడిపి పార్టీ నాయకులకు, వారి కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేవని కానీ వైయస్సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించామన్నారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తిని ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఆయన్ను మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నంద్యాల జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ పోచా శిలారెడ్డి, సంజామల మండల వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి, మత్స్యకార సంఘం అధికారి శ్రీనివాసులు, గిద్దలూరు గ్రామ మత్సకార సంఘం అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య, వెంకటప్రసాద్, పెద్ద వెంకటేశ్వర్లు, రాజశేఖర్, చిన్న రమణ, సంజీవుడు , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News