బనగానపల్లె నియోజకవర్గంలో సంజామల మండల కేంద్రంలోని గ్రామ సచివాలయం పరిధిలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి నిర్వహించారు. సంజామల గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి గుండం సూర్య ప్రకాశ్ రెడ్డి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారి వివరాలు తెలియజేయాలని స్వయంగా ప్రజలతోనే తెలుసుకుంటూ అలాగే గ్రామంలోని కాలనీలో సమస్యలను తెలుసుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు సాగించారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అన్నింటిని ఇప్పటికే 98 శాతం మేర నెరవేర్చడం జరిగిందని తెలిపారు. ఆనాడు ప్రతిపక్ష నేతగా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టసుఖాలను స్వయంగా తెలుసుకొని నవరత్నాల పథకాల ద్వారా ఆ కష్ట,సుఖాలను నెరవేర్చుకున్న ఏకైక రాజకీయ నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా రెండు సంవత్సరాల పాటు ఆర్థిక వ్యవస్థ కుదిలైనప్పటికీ కూడా ఇచ్చిన హామీలను చెప్పిన ప్రతి సంక్షేమ పథకాన్ని కరోనా కష్టకాలంలో ప్రజలకు అందించి కరోనాకాలంలో ఆదుకన్న దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి మన వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాజకీయాలకు, కులాలకు, మతాలకు, అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు లబ్ధి చేకూరడం జరుగుతుందని తెలిపారు. ఇన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు తోపాటు అభివృద్ధిని కూడా సమానంగా తీసుకు వెళుతున్న వైఎస్ఆర్ ప్రభుత్వం మీద టిడిపి పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం జరుగుతుందని గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేశారో ప్రజలకు తెలుసని చెప్పారు. నేడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కూడా ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నట్టు, రాబోయే 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీతో 175 కి 175 స్థానాల్లో ప్రజలు వైయస్సార్ పార్టీ శాసనసభ్యులను గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి ,మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చిన్నబాబు,మండల అభివృద్ధి అధికారి నాగ ప్రవీణ్ కుమార్,మండల తహశీల్దార్, సంజామల గ్రామ వైయస్సార్ పార్టీ ,మండల అధికారులు,మండల ప్రజా ప్రతినిధులు, సంజామల గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ సచివాలయం సిబ్బంది,గృహ సారథులు,వాలంటీర్లు పాల్గొన్నారు.