జిల్లా పరిషత్ యందు ఆర్థిక ప్రణాళిక గురించి జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి హాజరయ్యారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ఇళ్లు కేటాయించిన లబ్ధిదారులకు రుద్రవరం లేఅవుట్ దూరం అవుతుందని, వారికి తడకనపల్లె, లక్ష్మీపురం లేఔట్లను కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు.. అదేవిధంగా కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో ఉన్న ప్రజలు ఓటీఎస్ కింద డబ్బు కట్టడానికి సిద్ధంగా ఉన్నారని, హౌసింగ్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.. హెచ్ఎన్ఎస్ఎస్ కు సంబంధించి కొంగనపాడు, లద్దగిరి గ్రామాల దగ్గర ఉన్న ఫీల్డ్ చానల్స్ చేయలేదని మంత్రి దృష్టికి తెచ్చారు… మల్లికార్జున రిజర్వాయర్ కి సంబంధించిన పనులను చేపడుతున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రికి పాణ్యం శాసనసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా సుందరీకరణలో భాగంగా హంద్రీ నది తీరంలో ఉన్న ముళ్ళ కంపలను రెండు ప్రోకైన్లతో క్లీన్ చేయించామని, చేయించిన పనులు మీరు కూడా చూడాలని ఆర్థిక శాఖ మంత్రిని ఎమ్మెల్యే కోరారు.
Katasani: పాణ్యం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES