Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

Katasani: విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు పెద్దపీట

గడప గడపకు మన ప్రభుత్వంలో కాటసాని

కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోకి విలీనమైన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు నగర మేయర్ బి.వై‌. రామయ్య, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. 28వ వార్డు లక్ష్మీపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ద్వారా పొందిన లబ్దిని ప్రజలకు వివరించారు. స్థానిక సమస్యలు అడిగి, వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే సాముహిక మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా విలీన గ్రామాల్లో రూ.19.8 కోట్లను కర్నూలు నగర పాలక సంస్థ ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ స్థాయిలో నిధులు కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. టిడిపి ప్రభుత్వంలో నగర నడిబొడ్డున గుంతలు పడినా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో టిడిపికి ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా దక్కదన్నారు. జిల్లాలోని ఎంపి, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపిపి స్థానాల్లో ఒక్కటి కూడా గెలిపించుకోలేని టిడిపి నేతలు అన్ని శాసనసభ స్థానాల్లో గెలుస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలను కుల, మత, రాజకీయాలకతీతంగా అందిస్తూ, అవినీతికి ఆస్కారం లేకుండా పాలన చేస్తున్నా వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు దీవించాలని కోరారు. రాష్ట్రంలో టిడిపికి ఒక్క సీటు కూడా దక్కే పరిస్థితి కూడా లేదన్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో డిపాజిట్లే గల్లంతవుతాయన్నారు. ఆ భయంతోనే చంద్రబాబు, దత్తత పుత్రుడు, సొంతపుత్రుడు తలొక ప్రాంతంలో రెచ్చగొడుతూ, అబద్దాలు చెప్పుకుంటూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

కార్యక్రమంలో వైయస్ఆర్ సిపి మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ గాజుల శ్వేతరెడ్డి, కార్పొరేటర్లు ఇప్పాల నారయణ రెడ్డి, సాన శ్రీనివాసులు, లక్ష్మికాంత రెడ్డి, లక్ష్మి రెడ్డి, డిఈఈ గోపాలకృష్ణ, నాయకులు ఎన్.గోపాల్ రెడ్డి, భీమేశ్వర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కురుబ అనిల్ కుమార్, తిరుపాలు, ఆశోక్ రెడ్డి, కేశవరెడ్డి, మస్తాన్, సత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News