నియోజకవర్గ ప్రజలకు విద్యుత్ సమస్య లేకుండా చేయడమే వైసిపి పార్టీ లక్ష్యమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, ఓర్వకల్ మండలం, సోమయాజుల పల్లె సబ్ స్టేషన్ లో నూతనంగా 220 కెవి. విద్యుత్ లైన్ విస్తరణ పనుల ప్రారంభోత్సవం ఏర్పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరై, పూజా కార్యక్రమం ద్వారా పనులను ప్రారంభించారు. కాటసాని మాట్లాడుతూ ..పాణ్యం నియోజకవర్గంలో గ్రామాలలో విద్యుత్ సమస్యలు లేకుండా చేసేందుకు వైసీపీ పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సోమయాజుల పల్లె గ్రామ సర్పంచ్ విజయమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు మదన్, కృష్ణారెడ్డి, ఓర్వకల్లు ఎస్సై, ఎలెక్ట్రికల్ అధికారులు ఏ.డి.యస్.సి తదితరులు పాల్గొన్నారు.
