Thursday, July 4, 2024
Homeఆంధ్రప్రదేశ్Katasani: ఉపాధి అవకాశాలతో ఉన్నత స్థాయికి

Katasani: ఉపాధి అవకాశాలతో ఉన్నత స్థాయికి

యువత ఉపాధి అవకాశాలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బివై రామయ్యలు ఆకాంక్షించారు. బిర్లా కాంపౌండ్, సాయి వసంత్ కాంప్లెక్స్ నందు అరుణా రెడ్డి, సాయి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టంబుల్ డ్రై క్లీనర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బివై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక హాజరయ్యారు. యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధునాతన పద్ధతులతో దుస్తులు డ్రైక్లీనింగ్ వల్లదుస్తులకు రక్షణగా ఉండి, అధిక కాలం మన్నికతో ఉంటాయని అన్నారు. ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలను అవగాహనాతో కృషి చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి,వైసీపీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News