గ్రామ/వార్డు వాలంటీర్ల సేవలు అమోఘం, అద్భుతం అంటూ అభివర్ణించారు ఎమ్యెల్యే కాటసాని, మేయర్ రామయ్య. స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ‘వాలంటీర్లకు వందనం-2023 కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరై, ప్రసంగించిన పాణ్యం ఎమ్యెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ,నగర మేయర్ .బీవై.రామయ్య .. ఈ సందర్భంగా మేయర్ బీవై.రామయ్య మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకొల్పిన గ్రామ వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా లంచాలకు తావులేకుండా అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలు అందుతున్నాయన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ ఏర్పాటు చేశారన్నారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందడానికి కారణం వాలంటీర్లేనని, ఒకటో తేదీ వేకువజామున ఇంటి వద్దే పింఛన్లు అందుతున్నాయంటే వాలంటీర్ల చిత్తశుద్ధే కారణమన్నారు. ఎవ్వరికి ఏ అవసరం వచ్చినా మేమున్నాం అంటూ ముందుకు వచ్చి ధైర్యం ఇచ్చేది వాలంటీర్లే అన్నారు…
ఎమ్మెల్యే .కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేరవేయడంతో పాటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధాన కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వలంటీర్ల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. గ్రామ స్వరాజ్యం సాధించడానికి ముఖ్యమంత్రి సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేవలం గౌరవ వేతనం తీసుకుని ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వాలంటీర్లు అందిస్తున్న సేవలను అటు ప్రజలు, ఇటు ప్రభుత్వం ఎప్పుడు మర్చిపోలేరని కొనియాడారు…
అనంతరం కల్లూరు అర్బన్ పరిధిలోని 48 సచివాలయాల వాలంటీర్లలో ఇద్దరికీ సేవరత్న, 734 మందికి సేవమిత్ర అవార్డులతో ఘనంగా సన్మానించారు.. ఈకార్యక్రమంలో… డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, స్టాండింగ్ కమిటీ సభ్యులు వైజ అరుణ, సాన శ్రీనివాసులు, ఉప కమిషనర్ రమాదేవి, అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, మేనేజర్ చిన్నరాముడు, వైయస్ఆర్ సిపి మహిళా విభాగం జోనల్ ఇంచార్జ్ గాజుల శ్వేత రెడ్డి, కార్పొరేటర్లు లక్ష్మిరెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి,మిద్దె చిట్టెమ్మ,పల్లె శారద,ఎరుకల వెంకటేశ్వర్లు, మైతాపు నరసింహులు, సంగాల సుదర్శన్ రెడ్డి, నారాయణ రెడ్డి,మెప్మా పిడి వెంకటలక్ష్మి, సూపరింటెండెంట్ మంజూర్ బాష, వెల్ఫేర్ ఇంచార్జ్ పెన్షన్ కుమార్, వైకాపా యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి హనుమంత్ రెడ్డి, జోనల్ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..
Katasani: గ్రామ వాలంటీర్ల సేవలు అమోఘం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES