Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kautalam: 32 జంటలకు సామూహిక ఉచిత వివాహాలు

Kautalam: 32 జంటలకు సామూహిక ఉచిత వివాహాలు

కౌతాళం మండలంలోని పోదులకుంట- మదిరి గ్రామంలో ఉటగనూరు తాత మఠంలో 32 జంటలకు పంపారెడ్డి తాత అధ్వర్యంలో ఘనంగా సాముహిక వివాహాలు జరిగాయి. ఈ వివాహాలకు మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా తాళిబొట్లు, కాలిమేట్టలు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అనంతరం మఠం పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువా పూలమాల వేసి సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలకు తమ కుటుంబం ఎల్లవేళలా సహకారాలు అందిస్తుందన్నారు. అనంతరం ఆయన కౌతాళం, ఉరుకుంద, ఓబులాపురం, సూగురు, దోడ్డిబెళగల్ వార్డ్ మెంబర్ నారాయణ పెళ్ళిలకు హజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అడివప్ప గౌడ్, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు చెన్నబసప్ప, తెలుగు రైతు జిల్లా ప్రదాన కార్యదర్శి వెంకటపతి రాజు, జిల్లా కార్యదర్శి కోట్రేష్ గౌడ్,జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు భరద్వాజ్ శేట్టి, బిసి సెల్ జిల్లా కార్యదర్శి కురుగోడు,డాక్టర్ రాజానంద్, తెలుగు యువత మీడియా కోర్డినేటర్ విజయ రామిరెడ్డి, యస్ సి సెల్ జిల్లా కార్యదర్శి రాజాబాబు, బిసి సాధికారిక సభ్యులు సిద్దు, ఐటిడిపి ఉపాధ్యక్షులు మంజునాత్, దుద్ది ఉసేని, సూగురు నాగేష్, భీమయ్య, శివప్పగౌడ్, కావలి ఈరప్ప, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News