వర్షంలోనే కౌతాళం మండలంలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పర్యటించారు.. మండల కేంద్రమైన కౌతాళంలో 2.11 కోట్లతో నిర్మించిన జిల్లా పరిషత్ హై స్కూల్ నూతన భవనాన్ని, ఎరిగేరిలో తాగునీటి పైప్లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.. ఒక వైపు చినుకులు పడుతున్న ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా మలచిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు.. విద్యారంగానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారన్నారు.. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఓర్వలేకనే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు..2024 ఎన్నికల్లో ఆంధ్ర ప్రజల ఆశీస్సులతో మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం అన్నారు.. మంత్రాలయం నియోజకవర్గం ప్రజల సైతం తనను ఆదరించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో ఎంపీపీ అమరేష్, జడ్పిటిసి రాధమ్మ, ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కృష్ణంరాజు, వైస్ ఎంపీపీ బుజ్జి స్వామి, మండల కో ఆప్షన్ నెంబర్ మహమ్మద్ సాబ్, మండల వైకాపా నాయకులు దేశాయి ప్రహల్లాద ఆచారి, లక్ష్మిరెడ్డి, ఏకాంబర రెడ్డి , నీలకంఠారెడ్డి, వడ్డే రామన్న, గుర్నాథ్ రెడ్డి, వల్లూరు మరే గౌడ, ఆయా శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసి నాయకులు పాల్గొన్నారు.