కక్ష సాధింపు చర్యలో భాగంగా వైసీపీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని కౌతాళం టీడీపీ మండిపడింది. చంద్రబాబు నాయుడు ప్రజాదరణను ఓర్వలేక అక్రమంగా అరెస్టు చేశారని వారు ఆరోపించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గ ఇన్చార్జ్ తిక్కారెడ్డి ఆధ్వర్యంలో బందు నిర్వహించారు.. కౌతాళం మండలంలో అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, దుకాణాలు బందు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నబసప్ప మాట్లాడుతూ ప్రజలు కూడా ఈ వికృతకాండను వ్యతిరేకిస్తూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసి సహకరించారు అని అన్నారు… వైసీపీ ఎన్ని వికృత చేష్టలు చేసినా అంతకు రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు, నాయకులు ప్రజల మన్ననలు పొందుతూ రానున్న రోజుల్లో పార్టీ అధికారంలో రావడానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అడిగప్ప గౌడ్, వెంకటపతి రాజు, కొట్రేష్ గౌడ్, టిప్పు సుల్తాన్, రమేష్ గౌడ్, మూలంటి ఈరన్న, మంజునాథ్, రాజబాబు, రసూలు, భూత్ ఇన్చార్జీలు, ఐటిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.