Saturday, November 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Kavali: సర్వ హక్కులూ రైతన్నలకే: జగన్

Kavali: సర్వ హక్కులూ రైతన్నలకే: జగన్

చుక్కల భూములను 22- ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, రైతులకు పూర్తి హక్కులు కల్పించే కార్యక్రమం నెల్లూరు జిల్లా కావలిలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

- Advertisement -

దశాబ్దాల సమస్యకు చరమగీతం పాడుతూ..చుక్కల భూముల చిక్కులకు శాశ్వత పరిష్కారం, రైతన్నలకు ఇక నిశ్చింత అంటూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో లబ్ధిదారులు తమ అభిప్రాయాలను సీఎం సాక్షిగా వివరించటం విశేషం.

మద్దెల ప్రసాదు, రైతు, ముంగమూరు, బోగోలు మండలం

అందరికీ నమస్కారం, నేను 20 ఏళ్ళుగా రెండెకరాల భూమికి హక్కులు లేక గత ప్రభుత్వంలో రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయాయి, మన జగనన్న వచ్చిన తర్వాత చుక్కుల భూముల చిక్కులు శాశ్వతంగా పరిష్కరించారు, నాకు ఇద్దరు ఆడపిల్లలు, నా భార్య వికలాంగురాలు పెన్షన్‌ ఇవ్వమని గత ప్రభుత్వంలో అడిగితే ఖాళీ ఉంటే ఇస్తామని ఇవ్వలేదు, కానీ జగనన్న పాలనలో నా ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇచ్చారు, రూ. 3 వేలు తలుపుతట్టి ఇస్తున్నారు, నా పిల్లలకు విద్యా దీవెన, వసతి దీవెన వస్తున్నాయి, నేను దళితుడిని, నేను రెండు ఎకరాలు కౌలుకు సాగుచేస్తున్నాను, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు రూ. 41,500 నాకు పెట్టుబడి సాయం అందింది, జగనన్నను నేను జీవితంలో మరిచిపోలేను, మన దళితులు ఎదగాలంటే జగనన్న మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మనం మళ్ళీ సీఎం చేసుకుంటేనే మన బిడ్డల భవిష్యత్‌ బావుంటుంది. ధన్యవాదాలు.

మమత, మహిళా రైతు, జక్కేపల్లి గూడూరు, బోగోలు మండలం

అన్నా నమస్కారం, మాకు 3 ఎకరాల పొలం ఉంది, అది మేం పండించుకుంటాం కానీ హక్కులు లేవు, మీరు ఈ రోజు మాకు ఆ భూమిపై హక్కులు కల్పిస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. నన్ను మీరు రూ. 50 లక్షల విలువైన పొలానికి వారసురాలని చేశారు, నేనే కాదు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, నాకు ఇద్దరు పిల్లలు, వారికి అమ్మ ఒడి వస్తుంది, నేను వారిని ఇంగ్లీష్‌ మీడియంలో ప్రేవేట్‌ స్కూల్‌ లో చదివించాలనుకునేదానిని, కానీ మీరు అవన్నీ ఇవ్వడంతో వారు చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళని స్కూల్‌కు పంపుతుంటే చూడముచ్చటగా ఉంది, పిల్లలకు గోరుముద్ద పథకం కింద మంచి భోజనం ఇస్తున్నారు, మేం తల్లిదండ్రులుగా కూడా ఆలోచించని విధంగా మీరు మేనమామగా ఆలోచించి చేస్తున్నారు, మా డ్వాక్రా సంఘంలో నాకు మూడు విడతలుగా రూ. 22 వేలు వచ్చాయి, మా సంఘానికి బ్యాంకులో రూ. 10 లక్షలు ఇవ్వగా నా వాటాగా రూ. 1 లక్ష వచ్చాయి, దానికి కూడా సున్నా వడ్డీ పథకం కింద ఏప్రిల్‌ నెలలో వడ్డీ కూడా వేస్తున్నారు, బయట అధిక వడ్డీలకు ఇస్తుంటే మీరు సున్నా వడ్డీకి ఇస్తున్నారు. మాకు రైతుభరోసా సాయం అందింది, మా మామయ్యకు పెన్షన్‌ వస్తుంది, ఉదయం ఆరుగంటలకే వలంటీర్‌ వచ్చి మీ మనవడు ఇచ్చారని ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అన్నా మీరే మళ్ళీ మళ్ళీ సీఎం కావాలి, మేమంతా మీ వెనకే ఉంటాం, ధన్యవాదాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News