Kesineni Chinni Kollikuppadi Issue : అధికార తెలుగుదేశం పార్టీలో కొత్త వివాదం చెలరేగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) మధ్య 2024 ఎన్నికల టికెట్ వ్యవహారంపై భగ్గుమంటున్నారు. MLA కొలికపూడి తాను MP చిన్నికి రూ.5 కోట్లు ఇచ్చానని సంచలన ఆరోపణ చేశారు. ఆ మేరకు బ్యాంకు స్టేట్‌మెంట్‌ను వాట్సాప్ స్టేటస్‌గా, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో కలకలం మొదలైంది. సోషల్ మీడియాలో వీడియోలు, స్క్రీన్‌షాట్‌లు వైరల్ అవుతున్నాయి.
ALSO READ: Vegetarian diet : శాకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం.. నిపుణులు ఏమంటున్నారంటే..?
కొలికపూడి చెప్పిన వివరాల ప్రకారం, 2024 ఎన్నికల సమయంలో తిరువూరు TDP టికెట్ కోసం చిన్ని రూ.5 కోట్లు అడిగారని, తన అకౌంట్ నుంచి మూడుసార్లు రూ.60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశానని, చిన్ని PA మోహన్ పోరంకి వచ్చి క్యాష్‌లో రూ.50 లక్షలు తీసుకున్నారని, మిగిలిన రూ.3.50 కోట్లు అతని మిత్రులకు ఇచ్చానని తెలిపారు. ఇక ఈ వివాదం నేపథ్యంలో “రేపు ఈ విషయాలు మాట్లాడుకుందాం, నిజమే గెలవాలి” అంటూ ఫేస్‌బుక్ పోస్ట్‌లో రాశారు. ఈ పోస్ట్‌లు TDP కార్యకర్తల్లో దూమారం రేపాయి.
చిన్ని ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. “ఇది రాజకీయ కుట్ర, పార్టీలో టెన్షన్ పెంచడానికి” అని చెప్పారు. గతంలో కూడా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. మార్చి 2025లో కొలికపూడి TDP అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. ఆగస్టులో అక్రమ ఇసుక గని వ్యవహారంపై కూడా గొడవ చెలరేగింది. స్థానిక మీడియాలు, యూట్యూబ్ చానెళ్లు ఈ విషయంపై స్పెషల్ డిబేట్‌లు నిర్వహిస్తున్నాయి.
ఈ వివాదంపై TDP అధిష్ఠానం తక్షణ చర్య తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇద్దరినీ మంగళగిరి కార్యాలయానికి పిలిచారు. రేపు (అక్టోబర్ 24) సమావేశంలో పంచాయితీ జరుగనుంది. పల్లా చర్చించిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడుకు రిపోర్ట్ చేసి నిర్ణయం తీసుకుంటారు. పార్టీలో ఈ గొడవలు ప్రభావితం చేస్తాయని నేతలు ఆందోళన చెందుతున్నారు. TDP కార్యకర్తలు రెండు వర్గాలుగా విభజించబడ్డారు. కొందరు MLA వైపు, మరికొందరు MP వైపు మద్దతుగా నిలబడ్డారు.
ఈ వివాదం TDPలో టికెట్ కేటాయింపు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. రేపు సమావేశం తీర్మానం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అధిష్ఠానం సమతుల్యంగా నిర్ణయించాలని కార్యకర్తలు ఆశిస్తున్నారు. ఈ ఘటన పార్టీ ఐక్యతకు సవాలుగా మారింది.


