Wednesday, January 22, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Police: ఏపీ పోలీస్ శాఖలో కీలక మార్పులు.. హోంశాఖ ఉత్తర్వులు

AP Police: ఏపీ పోలీస్ శాఖలో కీలక మార్పులు.. హోంశాఖ ఉత్తర్వులు

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఏపీఎస్పీ బెటాలియన్(APSP Battalion)లో కీలక మార్పులు చేస్తూ హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బెటాలియన్లలో మంగళగిరి, కర్నూలు కేంద్రంగా డీఐజీ(DIG)లు ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో మంగళగిరి డీఐజీ పరిధిలోకి ఎచ్చెర్ల, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయనగరం, మంగళగిరి, మద్దిపాడు, విశాఖ బెటాలియన్లను.. డీఐజీ-2 పరిధిలోకి కర్నూలు, చిత్తూరు, వెంకటగిరి, కడప, అనంతపురం బెటాలియన్లతో పాటు SAR సీపీఎల్ యూనిట్‌ను చేరుస్తూ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News