Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Cabinet: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం

AP Cabinet: ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం

సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్‌ సమావేశం(AP Cabinet Meeting) ముగిసింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపారు.

- Advertisement -

30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్‌ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలు.. వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్‌, సౌర విద్యుత్‌ ప్లాట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. నిర్మాణ పనులను ఎల్‌1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. స్టేట్‌ సెంటర్‌ ఫర్‌ క్లైమేట్‌ ఇన్‌ సిటీస్‌ వ్యవస్థల ఏర్పాటును ఆమోదించింది. పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని అంగీకారం తెలిపారు.

విశాఖలోని ఐటీహిల్‌ -3 పైన టీసీఎస్‌కి 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి 3.5 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయింపు
బలిమెల, జోలాపుట్‌ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్‌ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్‌ కన్సార్టియమ్‌కు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad