Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్TTD: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

TTD: టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు

తిరుమలలో(Tirumala) సమావేశమైన టీటీడీ పాలకమండలి(TTD Board) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. భక్తులకు అందించే సేవలపై, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫీడ్‌ బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. ఇక తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదన్నారు. అన్నప్రసాద తయారీ కేంద్రంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమిస్తామన్నారు. అలాగే స్విమ్స్ హస్పిటల్‌కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.

శారదా పీఠానికి కేటాయించిన మఠం లీజు రద్దు చెయ్యడానికి నోటీసులు జారీ చేశామని.. వారి వివరణ ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాల నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించామన్నారు. ఒంటిమిట్ట రామాలయంలో రూ.42 లక్షల బంగారు కలశం ఏర్పాటు చేశామని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News