Monday, February 24, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: గవర్నర్ ప్రసంగంలోని కీలక అంశాలు..

AP Assembly: గవర్నర్ ప్రసంగంలోని కీలక అంశాలు..

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్ సమావేశాలు(AP Assembly) ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్(Abdul Nazeer) ప్రసంగిస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. అందుకే ప్రజలు తమ ఓటుతో గత ప్రభుత్వానికి మంచి గుణపాఠం చెప్పారని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని పేర్కొన్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ప్రజల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని వివరించారు.

- Advertisement -

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంఆ 200 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామన్నారు. పెన్షన్లు రూ.4 వేలకు పెంచామని చెప్పుకొచ్చారు. త్వరలోనే మెగా డీఎస్సీని నిర్వహించబోతున్నామన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాంమని.. పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించామని వెల్లడించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం నాణేనికి రెండు వైపుల లాంటిదని.. రెండింటినీ బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళుతుమన్నారు.. ఐటీ నుంచి ఏఐ రెవల్యూషన్‌ దిశగా ఏపీ సాగుతోందని.. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు.

ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని.. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్నామని వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామన్నారు. సమాజానికి వెన్నుముక అయిన బీసీ వర్గాలు కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వం ఆకాంక్ష అని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News