Key project for Amaravati: ఏపీ రాజధాని అమరావతికి కీలక ప్రాజెక్టు దక్కింది. ‘సెంట్రల్ గవర్నమెంట్ జనరల్ పూల్ ఆఫీస్ అకామిడేషన్’ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌కు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ చేశారు. ఏపీలో కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉనికిని బలోపేతం చేయడానికి, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచి పౌరులకు మరింత సమర్థవంతంగా సేవలను అందించడానికి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమరావతి అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఈ ప్రాజెక్ట్ ఒక ప్రధాన మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకే తాటిపైకి తీసుకురావడం ద్వారా.. పాలన మరింత సులభతరం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇది ఏపీ అభివృద్ధికి గణనీయమైన సహకారాన్ని అందిస్తుందన్నారు. ఏపీలో ప్రపంచస్థాయి పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్దతుకు ఈ ప్రాజెక్టే నిదర్శనమన్నారు.
CM Chandrababu: అమరావతిలో కీలక ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

