వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) ఇటీవల అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. గ్యాస్ట్రిక్ సమస్య కారణంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని.. స్టంట్ లేదా బైపాస్ సర్జరీ అవసరమవచ్చని వైద్యులు సూచించారు. అయితే సర్జరీ కోసం కొంత సమయం తీసుకోవాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత సర్జరీపై నిర్ణయం తీసుకోనున్నారు. గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందిన నాని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడటంతో డిశ్చార్జ్ అయ్యారు.
Kodali Nani: ఏఐజీ ఆసుపత్రి నుంచి కొడాలి నాని డిశ్చార్జ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES