వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) హెల్త్ అప్‌డేట్ వచ్చింది. ఆయనకు ముంబై ఏషియన్ హార్ట్ హాస్పిటల్‌లో నిర్వహించిన హార్ట్ సర్జరీ విజయవంతంగా ముగిసింది. ప్రముఖ కార్డియాక్ డాక్టర్ రమేష్ పాండా వైద్య బృందం సుమారు 10 గంటలపాటు సర్జరీ నిర్వహించింది. ప్రస్తుతం నాని విశ్రాంతి తీసుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేయనున్నారు.
కాగా కొడాలి నాని గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయిే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గుండెలో మూడు వాల్స్ క్లోజ్ అయ్యాయని నిర్ధారణకు వచ్చారు. దీంతో అత్యవసరంగా బైపాస్ సర్జరీ అవసరమని సూచించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు ఆయనను ప్రత్యేక విమానంలో ముంబై తీసుకెళ్లారు.