Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kodumuru: ప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి

Kodumuru: ప్లైన్ పనులు త్వరగా పూర్తి చేయాలి

కోడుమూరు నియోజకవర్గంలో పైపులైన్ల పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సుధాకర్ జిల్లా జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిల్లబండ గ్రామంలో 30 లక్షలతో పైప్ లైన్ నిర్మాణం 80 శాతం పూర్తయిందని టెక్నికల్ సమస్య వల్ల పనులు ఆగిపోయాయని పనులను త్వరితగతిన చేసేలా చర్యలు తీసుకోవాలని, గూడూరు మండలంలో బూడిదపాడు,పెంచికలపాడు, నాగలాపురం గ్రామాల్లో జల జీవన్ మిషన్కు సంబంధించిన టెండర్ పనులను త్వరితగతిన చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ ని కోరారు. రైతులకు గాజులదిన్నె, ఎల్ ఎల్ సి నుండి రెండు పంటలకు సరిపోయేలా నీటిని వస్తోందని, ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు. కోడుమూరు మండలంలో నీటి సమస్య లేదని, హంద్రీ, తుంగభద్ర,గాజులదిన్నె నుంచి నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నామని తెలిపారు.. రాష్ట్ర ప్రభుత్వం గాజులదిన్నె నుండి కోడుమూరు, ప్యాలకుర్తి, పులకుర్తి, రామచంద్రాపురం, వెంకటగిరి గ్రామాలకు 30 కోట్లతో పనులు మంజూరు అయ్యాయని, అందుకు సంబంధించిన టెండర్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. గాజులదిన్నె ప్రాజెక్ట్ ను 3.5 టిఎంసి నుండి 4.5 టిఎంసి చేసిన ఘనత ఆర్థిక శాఖ మంత్రిదని తెలిపారు. టివి9 కాలనీ లో 12,13 ఏళ్ల నుంచి 350 మంది ఆక్యుపేషన్ లో ఉన్నారని,ఆ సమస్యను పరిష్కరించాలని, అలాగే బి.తాండ్రపాడు, దిన్నదేవరపాడు గ్రామాలకు రెవెన్యూ వాళ్ళు ఇంటి పట్టాలు ఇచ్చినట్టు, పట్టాలు పంపిణీ చేసిన తర్వాత టిడ్కో వారు భూసేకరణ చేశారని బి తాండ్రపాడు, దిన్నె దేవరపాడు గ్రామాల్లో ఉన్న ప్రజలకు తిరిగి ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా నిడ్జురు గ్రామంలో రెండు,మూడు వార్డులలో ఇంటి పట్టాలు ఇవ్వలేదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మునగాలపాడు గ్రామంలో 35 మంది ఎస్సీలు సర్వేనెంబర్ 46 లో 89 ఎకరాల్లో సాగులో ఉన్నారని, టూరిజం శాఖ 89 ఎకరాల్లో బోటింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తెచ్చారు . ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తో చర్చించాలని మంత్రి టూరిజం ఆఫీసర్ ను ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News