కొలిమిగుండ్ల మండలం బందర్లపల్లి గ్రామ పరిధిలో వెలసి ఉన్న నేలబిలం మల్లేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు 26వ తేదీ నుండి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అర్చకులు రవి స్వామి తెలిపారు.
మహా శివరాత్రి సందర్భంగా 26వ తేదీ బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు పంచామృత అభిషేకం నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు మంగళ హారతి, 8 గంటలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి హారతి. సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9, 10, 11గంటలకు మల్లేశ్వర స్వామికి అభిషేకం, అర్ధరాత్రి 12 రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అర్చకులు రవి స్వామి తెలిపారు. భక్తాదులందరూ మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా ఆయన కోరారు.