గత మూడు సంవత్సరాలుగా కోసిగి గ్రామ ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులుల జాడను గుర్తించి బంధించడం కొరకు అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు కోసిగి కొండలో గురువారం కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి శివశంకర్ రెడ్ది, అటవీశాఖ రేంజ్ అధికారి తేజశ్విని, సెక్షన్ అధికారి మహీధర్ నాయుడు, తుమగభద్ర బీట్ ఆఫీసర్ అనురాధ, నేషనల్ వైల్డ్ లైఫ్ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త శ్రీధర్ లు కోసిగి లోని తిమ్మప్ప కొండ, సత్యమ్మ అవ్వ గొంది, బసవన్న కొండ, శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడి ప్రజలను, గర్రెలు, మేకల కాపరులను కలిసి చిరుత పులుల సమాచారం పై కొండ ప్రాంతంలో నివసించే ప్రజలను గొర్రెల కాపరులను సమాచారన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, గొర్రెల కాపరులు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడుతూ చిరుత పులుల వల్ల కంటిమీద కునుకు లేకుండా పోయిందని, తాము పెంచుకున్న గొర్రెలు, మేకల పై చిరుత పులులు దాడి చేసి చంపాయని గోడు చెప్పుకున్నారు. సాధ్య మైనంత త్వరలో చిరుత పులుల ను బందించి తమకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఫారెస్ట్ అధికారి శివశంకర్ రెడ్ది మాట్లాడుతూ రానురాను అడవి జంతువులు ఉండే అడవి శాతం తగ్గుముఖం పట్టిందని, దాంతో అవి ఆహారం, నీళ్లు సంవృద్దిగా లభీంచే కొండలను స్థావరాలుగా చేసుకున్నా యని చెప్పారు. కోసిగి కొండలో సంచరిస్తున్న చిరుతలను పట్టు కోవడంలో భాగంగా తిమ్మప్ప కొండ, సత్యమ్మ అవ్వ గొంది, బసవన్న కొండ ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేశామని, వాటి ద్వారా చిరుతల సంచారాన్ని గుర్తించి బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధిస్తామని తెలియ జేశారు. చిరుతలు సంచరించే ప్రదేశాల్లో నివాసం ఉండే ప్రజలు తమరు పిల్లలు, పెద్దలు బహిర్భూమి కోసం కొండలోకి వెళ్ళరాదని, రాత్రి వేళ్లలో ఆరుబయట పాడుకోరాదని సూచించారు. చిరుత పులులు కనిపిస్తే వాటిమీద దాడి చేయకుండా సమాచారన్ని ఫారెస్ట్ అధికారులకు చేరవేయాలని తెలిపారు.
Kosigi: చిరుత పులులను బందించేందుకై కెమరాల ఏర్పాటు
జిల్లా అటవీశాఖ అధికారి శివశంకర్ రెడ్డి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES