కోటేష్ హైదరాబాద్ లో బ్రాహ్మనందం చేతుల మీదుగా అవార్డు ను, ప్రసంశ పత్రాన్ని అందుకున్నారు. ఈ నెల పిబ్రవరి 1 వ తేది ఆయన పుట్టినరోజు సందర్బంగా ఆయన పొట్రాయిట్ చిత్రాన్ని వేయమని ఆర్ట్ ఛాలెంజ్ పోటీలను సాగంటి ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించారు. ఈ పోటీలకు 332 మంది చిత్రకారులు పాల్గొన్నారు. అందులో నంద్యాలకు చెందిన చిత్రకారుడికి ఆర్ట్ ఛాలెంజ్ లో సెకండ్ బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని చూసి బ్రాహ్మనందం ఎంతో అద్భుతమైన రీతిలో వేసావని కోటేష్ ను అభినందనలు తెలిపారు. ఆయన చిత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రసిద్ద చిత్రకారులు శేష బ్రహ్మం , అకాడమీ నిర్వహకులు మంజుల , అక్కడి చిత్రకారులు కోటేష్ ను అభినందనలు తెలిపారు. అవార్డు సాధించిన నంద్యాల చిత్రకారులు చిత్రకారులు రాముడు, సుంకన్న, ఓబులేసు, కిషోర్ తదితరులు అభినందనలు తెలిపారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2024/02/1bb559d5-b07d-4112-8074-a959d9e1dc95.jpg)
![](https://teluguprabha.net/wp-content/uploads/2024/02/1ba82211-2984-4d8b-b1a1-88f6e7ef6eee-1024x743.jpg)