Sunday, September 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kothapalli: సంగమేశ్వర సన్నిధిలో RSS చీఫ్ మోహన్ భగవత్

Kothapalli: సంగమేశ్వర సన్నిధిలో RSS చీఫ్ మోహన్ భగవత్

సప్త నదుల సంగమేశ్వర ఆలయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సందర్శించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం లో సప్త నదులు కలిసిన చోట వెలసిన సంగమేశ్వర క్షేత్రంలోని వేపదారు శివలింగంకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ జీ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు. మొదట భీమ లింగానికి పూజలు నిర్వహించిన మోహన్ భగత్ కృష్ణానదికి పూజ చేసి ప్రత్యేక హారతులు ఇచ్చారు. తదనంతరం  వేపదారు శివలింగంకు, రాజశ్యామల దేవికి, గాయత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సప్త నదులు కలిసే ప్రాంతాన్ని, ఆ ప్రాంత విశిష్టతను ఆలయ అర్చకులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

వారణాసిలోని కారిడార్ తరహాలో సంగమేశ్వర కారిడార్ నిర్మించాలని అర్చకులు కోరగా, సానుకూలంగా మోహన్ భగవత్ స్పందించినట్లు తెలిపారు.  అనంతరం జి పుల్లారెడ్డి స్వగ్రామమైన గోకవరం గ్రామంలో భక్తకన్నప్ప గురుకుల పాఠశాల సందర్శించి భోజనం చేశారు. విశ్రాంతి తీసుకుని అక్కడ ఉన్న పాఠశాలను పరిశీలించి స్థానిక ఆర్ఎస్ఎస్ నాయకులతో మాట్లాడారు.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటించే ప్రాంతం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండడంతో 500 మంది పోలీస్ సిబ్బందితో  భద్రత ఏర్పాటు చేశారు. వరుస కార్యక్రమాలు ముగించుకొని కర్నూలు బయలుదేరి వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News