Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Kotla Sujathamma: రోడ్డు కోసం ధర్నా

Kotla Sujathamma: రోడ్డు కోసం ధర్నా

ప్రజలే గుణపాఠం చెప్తారు అంటున్న సుజాతమ్మ

హోళగుంద నుండి ఆదోనికి వెళ్లాలి అంటే ఏ గుంతలో ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రయాణికులు, ప్రజలు, విద్యార్థులు తమ ప్రయాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తుందని టిడిపి ఆలూరు తాలూకా ఇంచార్జ్ కోట్ల సుజాతమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి కరువై రోడ్లు అద్వాన స్థితికి ఏర్పడ్డాయని, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని రోడ్డుమీద ఇసుక ట్రాక్టర్లు ఆపి నినాదాలు చేపట్టారు, కనీసం విద్యార్థులకు ఉపాధ్యాయులను కూడా నియమించలేని పరిస్థితి ఏర్పడిందని, విద్యార్థులకు అమ్మ ఒడి ఇవ్వడం కాదు విద్యను అందించే ఉపాధ్యాయులను నియమించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

గొప్పలు చెప్పుకోవడం కాదు హోళగుంద నుండి దణాపురం రోడ్డు, మార్లమడికి రోడ్డుకు భూమి పూజ చేసి 4 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు రోడ్డుకు పనులు మాత్రం జరగలేదని ఆమె ఆరోపించారు. మంత్రి ఉన్న సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే ఎలా అంటూ టీడీపీ నాయకులు రోడ్డుమీద గుంతలు చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర అభివృద్ధి టిడిపితోనే సాధ్యమని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు మేల్కొని రోడ్డు పనులు ప్రారంభించాలని తెలియజేస్తున్నామని, లేని పక్షాన రాబోయే ఎన్నికల్లో ఈ ప్రజా ప్రతినిధులకు అధికారులకు ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపుతామని కోట్ల సుజాతమ్మ హెచ్చరించారు. రోడ్డు కోసం కోట్ల సుజాతమ్మ అధ్యక్షతన టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు,టిడిపి యువ నాయకులు,ఐ టిడిపి నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, టిడిపి కార్యకర్తలు, కోట్ల అభిమానులు ,రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News