లోకేష్ వంద రోజుల పాదయాత్రకు సంఘీభావంగా ఆలూరు మండలం హత్తి బెలగల్ గ్రామం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, కోట్ల అభిమానుల అనుచర వర్గంతో పెద్ద ఎత్తున ఆలూరుకు పాదయాత్ర చేపట్టారు. అంతకు ముందు హత్తి బెలగల్ గ్రామంలోని దేవమ్మ ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి, పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్ర ఆలూరు కు చేరుకోగానే అభిమాన సందడి మధ్య అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె మాట్లాడారు. బెంజి మంత్రి నియోజకవర్గ సమస్యలను వదిలేశారని, ఎక్కడ అభివృద్ధి చేశారో చెప్పాలంటూ ఆమె దుయ్యబట్టారు. ఆలూరు నియోజవర్గంలో తాగునీరు దొరకడం లేదని, అయితే ఫుల్ గా మందు దొరుకుతుందని ఆమె విమర్శించారు. నియోజవర్గంలో తాగినీరు, రోడ్లు పలు సమస్యలతో ప్రజలు బాధలు పడుతున్న మంత్రి పట్టించుకోవడం గోరమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువనేత అర్ధగిరి రఘు ప్రసాద్ రెడ్డి, జిల్లా వాల్మీకి సాధికారగా కమిటీ అధ్యక్షులు భాస్కర్ నాయుడు, మాజీ ఎంపిటిసి నర్సప్ప కొమ్ము రామాంజని కన్వీనర్ అశోక్ మీసేవ రాము సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Kotla Sujathamma: నీతికి అవినీతికి పోరాటమే రాబోయే ఎన్నికలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES