గోనెగండ్ల మండల మాజీ ఎంపిపి కే వీ కృష్ణారెడ్డి గతవారం వేముగోడులోని తన స్వగృహంలో ప్రమాద వశాత్తు కిందపడి చేతి ఎముక విరిగి ఫ్రాక్చర్ కావడంతో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను మాజీ కేంద్ర మంత్రి, టిడిపి జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి వేముగోడు లోని ఆయన స్వగృహంలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తగు జాగ్రత్తలు సూచించారు. త్వరగా కోలుకోవాలని పార్టీకి నీ సేవలు చాలా అవసరమని తెలిపారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలన రాక్షస పాలన తలపిస్తుందని దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అక్రమ కేసులతో ప్రజలను, ప్రతిపక్ష నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని అన్నారు. ఆ రోజు టిడిపి లోకి రావడానికి ముందు నేను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేసి మా జిల్లాకు వేదవతి, గుండ్రేవుల, ఎల్ ఎల్ సి పైపులైన్ లను నిధులను మంజూరు చేయించుకుని వస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో పనులను మొత్తం ఆపి డబ్బులను లాగేసుకుని ప్రభుత్వం వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అయినe ఇంతవరకt పిడికెడు మట్టివేసి పని మొదలు పెట్టింది లేదన్నారు.
ఈ కార్యక్రమంలో కోడుమూరు నాయకులు మధు సూధన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, రాంబాబు, గోనెగండ్ల మండల నాయకులు మాజీ సింగిల్విండో ప్రెసిడెంట్ పరమేశ్వర రెడ్డి, ప్రభాకర్ నాయుడు, రంగున్ బాష, అలువాల సర్పంచ్ బాషా, గంజిల్ల లక్ష్మన్న, బాబు నాయుడు,ఎస్ బి యునూస్, కౌలుటలయ్య నాయుడు, చెంగల రాయుడు, దరగల మాబు, అలువాల లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.