Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Kovelakuntla: అభివృద్ధి పనులను ప్రారంభించిన కాటసాని

Kovelakuntla: అభివృద్ధి పనులను ప్రారంభించిన కాటసాని

బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలో 4 కోట్ల 48 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులను బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపి రెడ్డి ప్రారంభించారు. కోయిలకుంట్ల పట్టణంలో రెండు కోట్ల 45 లక్షల రూపాయలతో గాంధీనగర్ నాగుల కట్ట రోడ్ సాయి నగర్ సుంకులమ్మ కాలనీ కానాల అంకిరెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లు కాలువలు గ్రావెల్ రోడ్డు నిర్మాణాలను, ఒక కోటి 20 లక్షల రూపాయలతో జలజీవన్ పథకం ద్వారా పట్టణంలోని ప్రజలకు మంచినీటి కుళాయిలు, 23 లక్షల రూపాయలతో పట్టణంలోని ముదిగేటి రోడ్డు నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు మంచినీటి పైప్ లైన్ నిర్మాణాలను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి , జిల్లా పరిషత్ చైర్మన్ వీరభద్ర పాపి రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి నిర్వహించిన సభలో బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్ష నేతగా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవాలని లక్ష్యంతో 3648 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించి ప్రజల కష్టాలను తెలుసుకొని ఆనాడే నవరత్నాల పథకాలను ప్రకటించినటువంటి ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 151 సీట్లతో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పీఠం ఎక్కిన తర్వాత కరోనా మహమ్మారి రెండు సంవత్సరాల పాటు మన రాష్ట్ర, దేశ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేసిన కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేయాలని లక్ష్యంతో ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవానికి అందించిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దక్కుతుందని చెప్పారు. కేవలం ప్రజలకు సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధిని కూడా సమన్వయంతో ముందుకు వెళుతూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలతో ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. అయితే లోకేష్ యువ గళం పాదయాత్రలో మాట్లాడుతూ బనగానపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ హాయంలోనే అభివృద్ధి చెందిందని వైయస్సార్ పార్టీ హయాంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఏం పీకుతున్నారని చెప్పడం జరిగిందని అయితే తాను ఈరోజు కోవెలకుంట్ల పట్టణంలోనే నాలుగు కోట్ల 48 లక్షల రూపాయలతో కేవలం అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందని ఇదే మేము పీకుతున్న పని అని లోకేష్ కు హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రభుత్వ మీద మరియు ప్రజాప్రతినిధుల మీద నిలదీసే హక్కు ఉంటుంది కానీ వ్యక్తిగత విమర్శలు చేసే హక్కు ఎవరికీ ఉండదని కేవలం మిడిమిడి జ్ఞానంతో అర్థం పడటం లేని మాటలు మాట్లాడిన లోకేష్ గుర్తించుకోవాలని చెప్పారు. లోకేష్ పాదయాత్రలో బనగానపల్లెనియోజకవర్గం లో ఏ చిన్న సంఘటన కూడా జరగలేదని ఎవరు పాదయాత్రలు నిర్వహించిన అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదని అలా అడ్డుకుంటే వారే అభాస పాలవుతారని గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహిస్తే మహిళ సదస్సుకు మహిళలు రాకుండా అడ్డుకున్న ఘన చరిత్ర మీ టిడిపి పార్టీకే చెల్లిందని, మీ పార్టీ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డికే దక్కిందని చెప్పారు. ప్రతిపక్షం ఎక్కడైనా గట్టిగా ఉండాలని అయితే అది కేవలం అభివృద్ధి ప్రజా సమస్యల మీద మాట్లాడాలని వ్యక్తిగతంగా మాట్లాడేవాడు ప్రతిపక్ష నాయకుడు కానే కాదని చెప్పారు. లోకేష్ పాదయాత్రలో మాట్లాడుతూ ధనగానపల్లె నియోజకవర్గం లో బీసీ జనార్దన్ రెడ్డి సింహం లాంటివాడని చెప్పడం జరిగిందని అయితే సింహాలు అడవుల్లో ,జూ పార్కుల్లో మాత్రమే ఉండాలని ప్రజా సంచారంలో ఉంటే సింహాన్ని తరిమి తరిమి కొడతారని చెప్పారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు బాత్రూం కూడా బీసీ జనార్దన్ రెడ్డి వెళ్ళనిచ్చేవాడు కాదని లోకేష్ ప్రజాసభలో చెప్పడం జరిగిందని, మరి అంత చనువున్న బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం అంతా అభిమానం ఉన్న లోకేష్ కానీ బనగానపల్లె నియోజకవర్గంలో ఒక్క ఐటీ పరిశ్రమ అయినా తెప్పించారా అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని లక్ష్యంతో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. బనగానపల్లె పట్టణంలో 22 కోట్ల రూపాయలతో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని చెప్పారు అలాగే కోయిలకుంట్ల పట్టణంలో గతంలో ఒకే ఒక డాక్టర్ తో ఇక్కడ ప్రభుత్వ వైద్యశాల నడిచేదని మన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30 పడగల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరుగుతుందని త్వరలోనే 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుందని చెప్పారు. కోయిలకుంట్ల పట్టణం కూడా దినదినాభివృద్ధి చెందుతుందని దానికి తగ్గట్టు మనం రహదారిలో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని అందులో భాగంగానే ఎవరు చేయలేని సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని తాను కోయిలకుంట్ల పట్టణంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడమే కాకుండా డ్రైనేజీ వ్యవస్థను కూడా సమూలంగా మార్పులు చేయడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు నాలుగు కోట్ల 48 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రజలకు అంకితం చేయడం జరిగిందని చెప్పారు. అయితే ఇంత అభివృద్ధి కూడా కోయిలకుంట్ల పట్టణ ప్రజల సహాయ సహకారాలతోనే చేయడం జరిగిందని మునుముందు కూడా బనగానపల్లె నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలు తనకు అందిస్తే రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి పథంలో తీసుకువెళ్ళడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహాయ సహకారాలతోనే కోట్లాది రూపాయలతో బనగానపల్లె నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లడం జరుగుతుందని కాబట్టి ఎన్నికల ఎప్పుడు జరిగినా కూడా ముఖ్యమంత్రిగా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని,2024 ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా కాటసాని రామిరెడ్డి నిలబడడం జరుగుతుందని మీ ఆశీస్సులు తనకు మళ్ళీ అందించి మళ్లీ శాసనసభ్యునిగా గెలిపించాలని ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం ప్రజలు అందరినీ కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కర్ర గిరిజ హర్షవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి కర్ర హర్షవర్ధన్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు భీమిరెడ్డి రమాదేవి, జడ్పిటిసి వెంకట లక్ష్మమ్మ ,సర్పంచ్ మెట్ల సరళ, ఉపసర్పంచ్ జి.సి.ఆర్ సూర్యనారాయణ రెడ్డి, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ నాగార్జున రెడ్డి, APNGO’S రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణా రెడ్డి, రైతు సంఘం నాయకుడు కానాల రవీంద్రనాథ్ రెడ్డి, డాక్టర్ల సంఘం వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామిరెడ్డి గారు మరియు వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు ,పెద్ద ఎత్తున హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News