క్రిష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామంలో టిడిపి నుంచి పార్టీ మండల అధ్యక్షుడు ఆర్ బి వెంకటరాముడు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, ఎంపిపి డాక్టర్ వెంకట రామిరెడ్డి, జెడ్పీటీసీ కెఈ సుభాషిణి సమక్షంలో 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై ఆలంకొండ,పెద్దొడ్డి గ్రామాలకు చెందిన నక్కొల్లు, తలారోల్లు, కోయిలకొండ, బోయిని, ఊడలోల్లు వైసీపీలో చేరారు.
పెద్దకౌలుట్ల, చిన్నకౌలుట్ల, సోమన్న, వీరాంజనేయులు, మునీంద్ర, కౌరట్ల, మునిస్వామి, రామాంజనేయులు, రాఘవ, ముని, కె.రాఘవ, గంగన్న, తలారి మాధవ కృష్ణ,తలారి రమేష్, తలారి నాయుడు, సుధాకర్, తలారి సూర్యనారాయణ, తలారి రామాంజనేయులు, పుండుకూర నాయుడు,
సుదర్శన్, నాగరాజు, సుంకయ్య, వెంకటేశ్వర్లు, రామనందన, బోయిని రంగడు, బోయిని సుంకిరెడ్డి, బోయిన శివకుమార్, బోయిన నల్లారెడ్డి, శేఖర్, ఊడల మధు కుమార్, ఊడల మద్దయ్య, మణికంఠ అనిల్, గుడిసె రంగముని, పిక్కిరి ఆంజనేయులు, పెద్దోడ్డి గ్రామానికి చెందిన తలారి వెంకటరాముడు, తలారి అశోక్, తలారి ధనంజయ, తలారి ఆంజనేయ, నాగేశ్వరయ్య, సుదర్శన్, దేవేంద్ర ,వెంకటేష్ ,హరీష్, సుంకన్న రమేష్ తదితరులను ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వానించారు.
అలాగే పత్తికొండ మండలం జూటూరు గ్రామానికి చెందిన వడ్డే సురేంద్ర తిరిగి ఎమ్మెల్యే సమక్షంలో చెరుకులపాడు గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ లో చేరారు. ఈకార్యక్రమంలో ఆలంకొండ గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు క్రిష్ణగిరి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.